![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ జయం(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-204 లో.. ప్రీతి కళ్ళుతిరిగిపడిపోవడంతో అందరు తన దగ్గర ఉంటారు. అదే సమయంలో అంతకముందు ఏం అయిందోనని ఇషిక, పారు ఊహించుకుంటారు. ప్రీతి సరిగ్గా జ్యూస్ తాగే ముందు తన నెంబర్ కి అపరిచిత నంబర్ నుండి కాల్ చేస్తుంది ఇషిక. ఇక తను ఫోన్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తను తాగే జ్యూస్ లో ఏదో ట్యాబ్లెట్ వేస్తుంది ఇషిక. ఇక అది తెలియని ప్రీతి ఆ జ్యూస్ తాగేస్తుంది. దాని వల్ల ప్రీతి కళ్ళుతిరిగిపడిపోతుంది.
ఇక గంగ, రుద్ర హానీమూమన్ వెళ్ళకుండా ఉండిపోతారు. ఇక మత్తులో నుండి బయటకి వచ్చిన ప్రీతి.. నాకు ఏమైంది అమ్మ అని అడుగుతుంది. ట్యాబ్లెట్లు ఓవర్ డోస్ వల్ల కళ్ళుతిరిగిపడిపోయావని డాక్టర్ చెప్పారని శకుంతల అంటుంది. ఈ రోజు ఏమైనా ట్యాబ్లెట్ మళ్ళీ వేసుకున్నావా అమ్మ అని రుద్ర అడుగగా లేదని ప్రీతి అంటుంది. తనకి మెడిసిన్స్ ఎవరు ఇస్తున్నారని రుద్ర అడుగుతాడు. నేనే అని వీరు అంటాడు. ఇక నుండి తన భాద్యతలు అన్నీ గంగ చూస్కుంటుంది. ఒక్క చిన్న నెగ్లెజెన్నీని కూడా నేను సహించనని రుద్ర అంటాడు. అలాగే బావ అని వీరు అంటాడు. నువ్వు పొలిటికల్ గా బిజీగా తిరుగుతావ్ కదా వీరు అందుకే అని సాఫ్ట్ గా చెప్తాడు రుద్ర. ఫ్లైట్ వెళ్ళిపోయింది బావ అని వీరు అంటాడు. నా కోసం మీరు ఆగిపోయారా.. వద్దు నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేయండి వాళ్లు వెళ్తారని వీరూతో ప్రీతి అనగానే వద్దని రుద్ర అంటాడు. ఇప్పుడు నీ సేఫ్టీ మాకు ముఖ్యం అని రుద్ర అంటాడు.
ప్రీతికి కాస్త రెస్ట్ కావాలి మీరందరు వెళ్ళండి.. గంగ నువ్వు ఒక్కదానివే ఉండు అని రుద్ర చెప్తాడు. ఇక ఇషిక, పారు మాట్లాడుకుంటారు. అసలు ఆ టైమ్ కి తను పడిపోతుందో లేదో అనుకున్నా థాంక్ గాడ్ సరైన సమయానికి పడిపోయిందని పారుతో ఇషిక అంటుంది. అదే సమయంలో అక్కడికి వీరు వస్తాడు. ఇషిక.. ఎంత పని చేశావ్.. ఎందుకిలా చేశావ్.. ప్రీతి కడుపులో పెరుగుతుంది నా బిడ్డ.. తనకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి.. తను సేఫ్ గా ఉంటేనే నేను సేఫ్.. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే బాగోదని ఇషికకి వార్నింగ్ ఇస్తాడు. సారీ బ్రో .. వాళ్ళని హానిమూన్ కి వెళ్ళకుండా ఆపాలని ఇలా చేశామని ఇషిక అంటుంది. డోంట్ రిపీట్ దిజ్ అని వీరు చెప్పడంతో సరే అని ఇషిక అంటుంది. మరోవైపు ప్రీతి దగ్గరికి వంశీ, సూర్య, గంగ అంతా ఉంటారు. మీరందరు ఎందుకు ఉన్నారు.. తనకి రెస్ట్ కావాలని అందరిని బయటకి వెళ్ళిపోమంటాడు రుద్ర. వద్దు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య.. ఉండమని చెప్పు అని ప్రీతి రిక్వెస్ట్ చేయడంతో రుద్ర సరే అని వెళ్తాడు. ఇక మీ హానీమూన్ ట్రిప్ నా వల్ల క్యాన్సిల్ అయినందుకు సారీ అని ప్రీతి అనగానే సారీ ఏం అవసరం లేదు.. నీకే థాంక్స్ అని గంగ అంటుంది. ఎందుకు నీకు హానీమూన్ కి వెళ్ళడం ఇష్టం లేదా అని స్నేహా అడుగుతుంది. అక్కడికి వెళ్తే నేను తిండిపోతునని మీ అన్నయ్య తిడతాడని గంగ అంటుంది. మీ అన్నయ్య ఏం చేస్తాడో ఇప్పుడు చేసి చూపిస్తానంటూ యాక్టింగ్ చేస్తుంది. అప్పుడే రుద్ర వచ్చి గంగని తిడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |